కోవీడు కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వైరస్‌కు సంబంధించి ప్రజల‌ నుండి ఫిర్యాదులు స్వీకరించడానికి జిల్లాస్థాయి, డివిజన్‌ స్థాయి కంట్రోల్‌ రూమ్‌ల‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రారంభించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన జిల్లాస్థాయి కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించి వచ్చిన కాల్స్‌ వివరాల‌ను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్‌ లో కాల్‌ చేసిన వారి వివరాల‌ను, సమస్యను నమోదు చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆ విషయాల‌ను తెల‌పాల‌ని 24 గంటలు కంట్రోల్‌ రూమ్‌ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించాల‌ని ఆదేశించారు. డివిజన్‌ స్థాయిలో కూడా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

జిల్లాస్థాయి , డివిజన్‌ స్థాయి కంట్రోల్ రూంలు
జిల్లా స్థాయి 08462220183,

నిజామాబాద్‌ డివిజన్‌
8309219718,

బోధన్‌ డివిజన్‌
08467222001,

ఆర్మూర్‌ డివిజన్‌
08463295050.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్‌ అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉన్నందున వైరస్ వ‌ల్ల‌ ఇబ్బందులు పడుతున్న ప్రజలు పై ఫోన్‌ నెంబర్లకు ప్రాంతాల‌ వారిగా కాల్‌ చేసి వివరాలు తెలుసుకోవాల‌ని అని ఆయన కోరారు.

ప్రతి ఒక్కరు కోవిడ్‌ జాగ్రత్తలు మనసా వాచా కర్మణా తప్పనిసరిగా పాటించాల‌ని తద్వారానే ఎవరికి వారు స్వీయ రక్షణ పొందుతారని ఆయన పేర్కొన్నారు.

Check Also

ఖాళీగా ఉన్న స్థానిక ఎన్నికల‌కు సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని 56 గ్రామ పంచాయతీల‌లో ఖాళీగా ఉన్న నాలుగు ...

Comment on the article