28 వరకు డిగ్రీ రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ కళాశాల‌లోని డిగ్రీ కోర్సుకు చెందిన ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ మరియు రెండవ, నాల్గ‌వ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌ / బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు జనవరి, 2021 లో జరిగిన విషయం తెలిసిందే. అందుకు గాను డిగ్రీ పరీక్షల‌ సమాధాన పత్రాల‌కు ఈ నెల‌ 28 వరకు రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహింపబడుతుందని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

రీ వాల్యూయేషన్‌ పేపర్‌ ఒక్కింటికి 500 రూపాయలు, రీ కౌంటింగ్‌ పేపర్‌ ఒక్కింటికి 300 రూపాయలు, దరఖాస్తు ఫారానికి 25 రూపాయలు చెల్లించవల‌సి ఉంటుందన్నారు. కావున ఈ విషయాన్ని డిగ్రీ ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించగల‌రని తెలిపారు. పూర్తి వివరాల‌కు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌లో సంప్రదించాల‌న్నారు.

Check Also

ప్రశాంతంగా ప్రారంభమైన పరీక్షలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిద్‌ – 19 నిబంధనల‌ను అనుసరించి తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని ...

Comment on the article