కళ్యాణల‌క్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

బాన్సువాడ, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమ‌వారం తాడ్వాయి మండలానికి సంబంధించిన 11మందికి కళ్యాణ ల‌క్ష్మి, ముగ్గురికి షాదీ ముబారక్‌ చెక్కుల‌ను మొత్తం 14 మంది ల‌బ్దిదారుల‌కు రూ.14 ల‌క్షల‌ 1 వెయి 624 రూపాయల‌ చెక్కులు మరియు చెక్కుల‌తో పాటు ఆడపడుచుకు పెళ్లి కానుకగా పట్టు చీరను స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ పంపిణీ చేశారు.

కార్యక్రమంలో మండల‌ ఎంపిపీ కౌడీ రవి, జడ్పిటిసి బత్తుల‌ రమాదేవి నారాయణ, మండల‌ పార్టీ అధ్యక్షుడు సాయి రెడ్డి, వైస్‌ ఎంపీపీ ముదం నర్సింలు, ఎంపీటీసీ జలంధర్‌ రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, వెల‌మ‌ రవీందర్‌ రెడ్డి, రాజా గౌడ్‌, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

వ్యాయామశాలను పరిశీలించిన భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని హనుమాన్‌ ఆలయాన్ని శనివారం డిసిసిబి ఛైర్మన్‌ ...

Comment on the article