Breaking News

బోధన్‌ ప్రాంత ప్రజలు అల‌ర్ట్‌

బోధన్‌, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం వ‌ల్ల‌ బోధన్‌ ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాల‌ని, అవసరమైతేనే బయటకు రావాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కోరారు. బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్‌ సోమవారం తనిఖీ చేశారు.

కరోనా రోగుల‌కు అందుతున్న వైద్య సేవల‌ గురించి అడిగి తెలు‌సుకున్నారు. మహారాష్ట్రలో కరోనా విజ ృంభణ అధికంగా ఉందని తెలిపారు. బోధన్‌ ప్రాంతానికి మహారాష్ట్రతో సత్సంబంధాలు ఎక్కువగా ఉండటం వ‌ల్ల‌ అక్కడి నుంచి తరచూ అనేక మంది బోధన్‌కు రాకపోకలు చేస్తుంటారని గుర్తుచేశారు.

కరోనా వైరస్‌ ప్రభావం రోజు రోజుకు ఎక్కువవుతుందని, ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించాల‌ని సూచించారు. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల‌ని, శానిటైజర్‌ వాడాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని సూచించారు. కరోనా రోగుల‌కు ఇబ్బంది కల‌గాకుండా ఉండేందుకు బోధన్‌ ఏరియా ఆస్పత్రిలో మరో 50 పడకలు అందుబాటులోకి తెచ్చామని, దీంతో పాటు బోధన్‌లో 5 ప్రైయివేటు ఆస్పత్రుల‌ను కోవిడ్‌ ఆసుపత్రులుగా ఏర్పాటు చేశామని, 100 పడకలు ఏర్పాటుచేశామని చెప్పారు.

అమ్డాపూర్‌లోని కెజిబివిలో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. రెంజల్‌, వర్ని మండలాల‌లో త్వరలోనే ఏర్పాటు చేస్తామని వివరించారు. కోవిడ్‌ రోగికి ఇబ్బంది కల‌గకుండా చర్యలు తీసుకుంటున్నామని, విషమ పరిస్థితి ఉంటె జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించడం జరుగుతుందన్నారు. గుంపులుగా తిరగవద్దని, శుభకార్యాల‌కు వెళ్లవద్దని సూచించారు.

Check Also

ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్ట బడుతుంది

బోధన్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ పాల‌నలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఐఎఫ్‌టీయూ జిల్లా ...

Comment on the article