ఎక్కడివక్కడే… ఏమిటివి…

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో పిఎసిఎస్‌ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ తూకం వేయడంలో ఆల‌స్యం అవ్వడం వ‌ల్ల‌ ధాన్యం కుప్పలు ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు వాతావరణంలో మార్పు జరిగి కొన్నిచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడంతో ధాన్యం రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

తూకం వేయడంలో సొసైటీ అధికారుల‌ నిర్లక్ష్యం అని రైతులు అంటున్నారు. దాదాపు గత పది పన్నెండు రోజుల‌ నుండి దాన్యం తూకం వేయకపోవడం వ‌ల్ల‌ రైతులు నష్టాల‌కు గురవుతున్నారని వాపోతున్నారు. వర్షం పడి తడిస్తే మొల‌కెత్తే అవకాశం కూడా ఉందని అదే కొంచెం వర్షం పడితే ధాన్యం ముక్కి పోయి ధర వచ్చే అవకాశం ఉండదని అంటున్నారు.

ఈ విషయమై సొసైటీ అధికారుల‌ను వివరణ కోరుదామంటే సొసైటీ సెక్రటరీ అందుబాటులో లేరు, వైస్‌ చైర్మన్‌ దడివే నవీన్‌ను వివరణ కోరగా ఇక్కడి నుండి వెళ్ళిన ధాన్యం లారీలు రైస్ మిల్ల‌ర్‌ ధాన్యం ఖాళీ చేసుకోకపోవడం వ‌ల్ల‌ సకాలంలో లారీలు రానందున ధాన్యం తూకం వేయడం లేదని వివరించారు. కారణం ఏమిటని ప్రశ్నిస్తే దాన్యం కడతా ఉంటేనే లారీ నుండి ధాన్యం తీసుకుంటామని రైస్ మిల్లు వారు అంటున్నారని ఆయన తెలిపారు.

ఏదేమైనా రైతులు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రైతుల‌ సమస్యలు పట్టించుకొని తక్షణమే ధాన్యం తూకం వేయించి రైతు సమస్యను పరిష్కరించ వల‌సిందిగా కోరుతున్నారు.

Check Also

శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు

మోర్తాడ్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలో సోమవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలు ...

Comment on the article