Breaking News

భీమ్‌గల్‌ను సుందర పట్టణంగా తీర్చిదిద్దుతాం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్వరలో నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మున్సిపల్‌ కేంద్రంలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనుల‌కు మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తయిన పనులు త్వరగా పూర్తి చేయాల‌ని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి అధికారిక నివాసంలో భీంగల్‌ మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌ మల్లెల‌ రాజశ్రీ ల‌క్ష్మణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గోపు గంగాధర్‌, ఏ.ఈ రఘుతో పట్టణ అభివృద్ధి పనుల‌పై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భీంగల్‌ ప్రజల‌కు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సహకారంతో పట్టణాన్ని అన్ని సౌకర్యాల‌తో అభివృద్ధి చేసుకుంటున్నామని, ఇప్పటికే పలు బిటి రోడ్లు, సిసి రోడ్లు, డ్రైన్లు నిర్మించుకున్నామన్నారు.

భీంగల్‌ పట్టణం రానున్న రోజుల్లో అన్ని రకాల‌ అభివృద్ధి చెంది ఆదర్శంగా మారనుందని, సమీప గ్రామీణ ప్రాంతాల‌ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల‌ నుండి కూడా భీంగల్‌ పట్టణానికి పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగే ఆస్కారం ఉన్నదన్నారు. ప్రజా రవాణా, వ్యాపార, వాణిజ్య రవాణా పెరగనున్నదని, భీంగల్‌ మున్సిపల్‌ కేంద్రంలో పెరగనున్న రద్దీ దృష్ట్యా పట్టణ ప్రజల‌ సౌకర్యాల‌ను దృష్టిలో పెట్టుకుని బి.టి రోడ్లు, సిసి రోడ్లు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డు, కల్యాణ మండపం, వైకుంఠ దామాలు, ఓపెన్‌ జిమ్ లు, అర్బన్‌ పార్కును ఏర్పాటు చేసుకుంటున్నామని మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.

పేదింటి వారి పెండ్లిళ్ల కోసం నిర్మించే కళ్యాణ మండపం అత్యధునాతనంగా అన్ని రకాల‌ సౌకర్యాల‌తో ఏర్పాటు చేయాల‌ని మంత్రి అధికారుల‌కు సూచించారు. పట్టణ సుందరీకరణకు పెద్దపీట వేయాల‌ని అందులో భాగంగా మొక్కల‌ను పెంచి గ్రీనరిని పెంపొందించాల‌ని సూచించారు. పట్టణ ప్రజల‌కు ఆహ్లాదకరంగా ఉండేలా అర్బన్‌ పార్క్‌ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. వివిధ ప్రముఖ పట్టణాల్లోని అర్బన్‌ పార్కును పరిశీలించి భీంగల్‌లో కూడా అత్యాధునాతన హంగుల‌తో పార్కును ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాల‌ని ఆదేశించారు.

పిల్ల‌ల‌కు, పెద్దల‌కు సౌకర్యవంతమైన వాకింగ్‌ ట్రాక్స్‌, లాన్‌, వెయిటింగ్‌ హాల్‌, ఫుడ్‌ కోర్టు ఉండేవిధంగా చూడాల‌న్నారు. ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌-నాన్‌ వెజ్‌ మార్కెట్‌ యార్డు అన్ని వసతుల‌తో ఉండాల‌ని, వెజ్‌ ఒక వైపు, నాన్‌ వెజ్‌ ఒక వైపు, పండ్లు స్టాల్స్‌ ఒకవైపు ఉండేలా నిర్మాణం ఉండాల‌ని ఆదేశించారు. పట్టణంలో నలు వైపులా వైకుంఠ దామాలు నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు.

వైకుంఠ దామల్లో టాయిలెట్స్‌ నిర్మాణంతో పాటు స్నానాల‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. బిటి, సిసి రోడ్లు, డ్రైన్స్‌ త్వరగా పూర్తి చేయాల‌న్నారు. అన్ని ప్రాంతాల్లో పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ హరితహారంలో భాగంగా మొక్కలు పెద్ద సంఖ్యలో పెంచాల‌న్నారు. దాదాపు 15 కోట్ల నిర్మాణ వ్యయంతో ఇప్పటికే కొనసాగుతున్న పనులు, త్వరలో ప్రారంభం కానున్న పనులు పూర్తి నాణ్యతతో జరగాల‌ని, ఎప్పటికప్పుడు పనులు పురోగతి పర్యవేక్షిస్తానని అధికారుల‌తో మంత్రి అన్నారు. అర్బన్‌ పార్క్‌,ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డు, కల్యాణమండపం, వైకుంఠ దామాల‌ నిర్మాణ డిజైన్లు పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు.

Check Also

సిఎం కెసిఆర్ కీల‌క నిర్ణయం తీసుకున్నారు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా అనూహ్యంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల‌కు వైద్యాన్ని ...

Comment on the article