Breaking News

Daily Archives: April 22, 2021

నిఘా పటిష్టంగా నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సరిహద్దు గ్రామాల‌లో రాకపోకల‌పై నిఘా ఏర్పాట్లను పఠిష్టంగా నిర్వహించాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ మండల‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ టీముల‌ను ఆదేశించారు. గురువారం మద్నూర్‌, బిచ్కుంద, బాన్సువాడ, నిజాంసాగర్‌, బీర్కూర్‌, పిట్లం, నస్రుల్లాబాద్‌ మండల‌ వైద్య, పోలీసు, రెవెన్యూ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ టీముల‌తో జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోవిద్‌ పరీక్షలు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాల‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షల‌ను పెంచాల‌ని, అదే విధంగా వ్యాక్సినేషన్‌ కూడా పెంచాల‌ని ...

Read More »

కామారెడ్డి వ్యాపారస్తుల‌కు ముఖ్య గమనిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజ సంక్షేమం దృష్ట్యా వ్యాపార వాణిజ్య దుకాణములు 23వ తేదీ శుక్రవారం నుండి 30వ తేదీ వరకు మధ్యాహ్నం 3 గంటల‌కు దుకాణములు మూసివేయాల‌ని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వారు అత్యవసర ఆన్‌లైన్‌ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్నారు. ఇట్టి విషయాన్ని ప్రజలు మరియు వ్యాపార సంస్థలు గమనించి సహకరించగల‌రని కోరారు. సమావేశంలో అధ్యక్షుడు గజవాడ రవికుమార్‌, ఎల్లంకి శ్రీనివాస్‌, ...

Read More »

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదు అవుతున్నందున ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మరియు మున్సిపల్‌ ఛైర్మన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్మన్‌ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్‌ రెడ్డి సహకారంతో గురువారం 47వ వార్డ్‌ కౌన్సిల‌ర్‌ గెరిగంటి స్వప్న ల‌క్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 47వ వార్డ్‌లో కరోనా వైరస్‌ ప్రబల‌కుండ మునిసిపల్‌ సిబ్బంది సోడియం హైప్లో క్లోరైడ్‌ రసాయనం పిచికారీ చేశారు. కార్యక్రమంలో సానిటరీ ఎస్‌ఐ దేవిదాస్‌, జవాన్‌ నరేష్‌ ...

Read More »

గ్రామ కార్యదర్శిపై సస్పెన్షన్‌ వేటు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామ శివారులో అవెన్యూ ప్లాంటేషన్‌ నాటిన మొక్కల‌ చుట్టూ ఉన్న కంచెలు కొన్ని పడి పోయినందున గ్రామ కార్యదర్శిని సస్పెండ్‌ చేయాల‌ని ఎంపీడీవో ల‌క్ష్మిని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ ఆదేశించారు. గురువారం ఆయన అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కల‌ను పరిశీలించారు. హరితహారంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కల‌ సంరక్షణ చేయవల‌సిన బాధ్యత కార్యదర్శి, సర్పంచుల‌పై ఉందని ఆయన పేర్కొన్నారు.

Read More »

మృతదేహాల ‌ఖననం కోసం జేసిబి ఏర్పాటు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పురపాల‌క సంఘం, శాసనసభ్యులు పట్టణ ప్రజల‌ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ కరోనా బారినపడి మృత్యు ఒడిలోకి చేరిన వారికి సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల‌ చేశారు. శాసనసభ్యులు, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి సహకారంతో కరోనా మృతదేహాల‌ను ఖననం చేయటానికి ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండేలా ఒక జేసిబిని ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాన్ని అవసరమైన వారు ఉపయోగించుకోవాల‌ని కోరారు. ఎం.డి. ఫర్వేజ్‌ 9849907823 దేవదాస్‌ 9640050750 అబ్దుల్‌ మోమిన్‌ 8688110983 మరిన్ని ...

Read More »

కళ్యాణ ల‌క్ష్మి చెక్కుల‌ పంపిణీ

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నూతన వధూవరుల‌కు అందిస్తున్న కళ్యాణ ల‌క్ష్మి చెక్కుల‌ను గురువారం మోర్తాడు మండల‌ కేంద్రంలోని మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌యం ఆవరణలో మండల‌ ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగం శ్రీనివాస్‌, మోర్తాడ్‌ జెడ్‌పిటిసి అద్దం రవి కళ్యాణ ల‌క్ష్మి చెక్కుల‌ను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అమ్మాయి పెళ్లి కానుకగా ప్రవేశపెట్టిన కళ్యాణ ల‌క్ష్మి పథకం నేడు రాష్ట్రంలో ఎంతో మందికి ఆసరాగా నిలుస్తోందని జడ్పిటిసి బద్దం రవి పేర్కొన్నారు. ...

Read More »

పాఠశాలల‌ ఉపాధ్యాయుల‌కు బియ్యం పంపిణీ

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పాఠశాల‌లు మూతపడడంతో ప్రయివేటు టీచర్లకు వేతనాలు లేక అవస్థలు పడుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ పాఠశాల‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల‌ను ఆదుకునేందుకు సాయం ప్రకటించింది. ప్రతి టీచర్‌కు రూ.2 వేల‌ నగదు, అలాగే ఒక్కో టీచర్‌కు 25 కిలోల‌ బియ్యం అందిస్తున్నారు. ఇందులో భాగంగా మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో గురువారం స్థానిక మండల‌ ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగం శ్రీనివాస్‌ బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి శ్రీనివాస్‌ ...

Read More »

నిల‌కడగా సిఎం ఆరోగ్యం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుకి సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో సిటి స్కాన్‌ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సీఎం వ్యక్తిగత వైద్యులు ఎం.వి. రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షల‌ను నిర్వహించారు. సీఎం ఊపిరితిత్తులు సాధారణంగా వున్నాయని, ఎటువంటి ఇన్‌ఫెక్షన్‌ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల‌ నిమిత్తం కొన్ని రక్త నమూనాల‌ను సేకరించారు. రక్త పరీక్షల‌కు సంబంధించిన రిపోర్టులు రేపు రానున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిల‌కడగా వుందని, ...

Read More »