Breaking News

కళ్యాణ ల‌క్ష్మి చెక్కుల‌ పంపిణీ

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నూతన వధూవరుల‌కు అందిస్తున్న కళ్యాణ ల‌క్ష్మి చెక్కుల‌ను గురువారం మోర్తాడు మండల‌ కేంద్రంలోని మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌యం ఆవరణలో మండల‌ ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగం శ్రీనివాస్‌, మోర్తాడ్‌ జెడ్‌పిటిసి అద్దం రవి కళ్యాణ ల‌క్ష్మి చెక్కుల‌ను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అమ్మాయి పెళ్లి కానుకగా ప్రవేశపెట్టిన కళ్యాణ ల‌క్ష్మి పథకం నేడు రాష్ట్రంలో ఎంతో మందికి ఆసరాగా నిలుస్తోందని జడ్పిటిసి బద్దం రవి పేర్కొన్నారు.

పేదింటి ఆడపిల్ల‌ల‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ ల‌క్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల‌ను మంజూరు ఇస్తూ నిరుపేద ప్రజల‌కు ఎంతో మేలు కల్పిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ సుజాత, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌, తహసిల్దార్‌ కార్యాల‌యం సీనియర్‌ అసిస్టెంట్‌ షబ్బీర్‌ అలీ, మోర్తాడ్‌ మండల‌ టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా, మోర్తాడ్‌ సర్పంచ్‌ బోగ ధరణి ఆనంద్‌, కల్యాణల‌క్ష్మి ల‌బ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న సర్వసభ్య సమావేశం

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌యంలో ఈ నెల‌ ...

Comment on the article