Breaking News

పాఠశాలల‌ ఉపాధ్యాయుల‌కు బియ్యం పంపిణీ

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పాఠశాల‌లు మూతపడడంతో ప్రయివేటు టీచర్లకు వేతనాలు లేక అవస్థలు పడుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ పాఠశాల‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల‌ను ఆదుకునేందుకు సాయం ప్రకటించింది. ప్రతి టీచర్‌కు రూ.2 వేల‌ నగదు, అలాగే ఒక్కో టీచర్‌కు 25 కిలోల‌ బియ్యం అందిస్తున్నారు. ఇందులో భాగంగా మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో గురువారం స్థానిక మండల‌ ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగం శ్రీనివాస్‌ బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపిపి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంత మంచి కార్యక్రమం ఏ దేశంలో కూడా లేదని అన్నారు కార్యక్రమంలో మోర్తాడ్‌ జడ్పిటిసి బద్దం రవి, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌, స్థానిక డిప్యూటీ తాసిల్దార్‌ సుజాత, మోర్తాడ్‌ సర్పంచ్‌ భోగ ధరణీ ఆనంద్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ మోర్తాడ్‌ మండల‌ అధ్యక్షుడు కల్లెడ ఏలియా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఈజీఎస్‌ పనులు పరిశీలించిన ఎంపీడీవో

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో జరుగుతున్న ఈజీఎస్‌ పనుల‌ను శనివారం ...

Comment on the article