Breaking News

నిల‌కడగా సిఎం ఆరోగ్యం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుకి సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో సిటి స్కాన్‌ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సీఎం వ్యక్తిగత వైద్యులు ఎం.వి. రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షల‌ను నిర్వహించారు. సీఎం ఊపిరితిత్తులు సాధారణంగా వున్నాయని, ఎటువంటి ఇన్‌ఫెక్షన్‌ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల‌ నిమిత్తం కొన్ని రక్త నమూనాల‌ను సేకరించారు. రక్త పరీక్షల‌కు సంబంధించిన రిపోర్టులు రేపు రానున్నాయి.

సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిల‌కడగా వుందని, త్వరలో కోలుకుంటారని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వెల్ల‌డించారు. సీఎం వెంట మంత్రి కేటీఆర్‌, ఎంపి జె. సంతోష్‌ కుమార్‌ ఇతర కుటుంబ సభ్యులున్నారు.

Check Also

కరోనా ల‌క్షణాలు ఉన్నవారు ఇఎస్‌ఐ ఆసుపత్రిలో ఉచిత ఆర్‌టిపిసిఆర్‌ టెస్ట్‌ చేయించుకోవడం ఎలా?

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 1. ఉదయం 6:00 గంటల‌కు ఆధార్‌ కార్డ్‌ మరియు ...

Comment on the article