Breaking News

Daily Archives: April 23, 2021

కోవిడ్‌ చికిత్సకు మోడల్‌ స్కూల్స్‌, కెజిబివిలు, సంక్షేమ గురుకులాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వైరస్‌ ఉద్ధృతికి అనుగుణంగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల‌ను చికిత్సలు అనుగుణంగా మార్చుకోవడమే కాకుండా డివిజన్‌ స్థాయిలో మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవిలు, సంక్షేమ గురుకులాల‌ను కరోనా వైరస్‌ చికిత్స కొరకు ఇప్పటికే ఉపయోగిస్తున్నామని అదేవిధంగా క్వారంటైన్‌ కేంద్రాలుగా వాడుకుంటున్నామని తెలిపారు. అవసరాన్ని బట్టి మిగతా భవనాల‌ను కూడా ఇందు కొరకు వాడుకుంటామని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలోని సంక్షేమ శాఖ గురుకులాల్లో, మోడల్‌ స్కూల్స్‌ లో, కేజీబీవీలో 2,200 ...

Read More »

ఎన్నికలు వాయిదా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ 19 మహమ్మారి జిల్లాలో విస్తరిస్తున్న కారణంగా ఈ నెల‌ 25 న జరగాల్సిన నిజామాబాద్‌ జిల్లా న్యాయవాద పరస్పర సహకార సొసైటీ ఎన్నికల‌ ఓటింగ్‌ ప్రక్రియను తాత్కాలిక వాయిదా వేసినట్లు ఎన్నికల‌ అధికారులు బండారి కృష్ణానంద్‌, జగన్‌ మోహన్‌ గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సొసైటీ ఎన్నికల‌ ఓటింగ్‌ ప్రక్రియ తిరిగి ఎప్పుడు నిర్వహించేది తేదీని త్వరలోనే న్యాయవాద సభ్యుల‌కు తెలియడం జరుగుతుందని జిల్లాలో న్యాయవాది సభ్యులు అందరూ సహకరించవల‌సిందిగా విజ్ఞప్తి ...

Read More »

మేడే పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 135 వ మేడే దినోత్సవ పోస్టర్లను జిల్లా కేంద్రంలోని యూనియన్‌ కార్యాల‌యం, కోటగల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల‌ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకన్న మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక రంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు కోడ్ల‌‌ను రద్దు చేయాల‌న్నారు. ప్రభుత్వరంగ సంస్థల‌ ప్రైవేటీకరణను ఆపివేయాల‌న్నారు. ప్రభుత్వ రంగ సంస్థల‌ను కాపాడుకోవడానికి కార్మిక రంగం ముందంజలో ఉండి పోరాడాల‌న్నారు. కరోనా సంక్షోభ సమయంలో దేశ వ్యాప్తంగా ...

Read More »

కరోనా ల‌క్షణాలు ఉన్నవారు ఇఎస్‌ఐ ఆసుపత్రిలో ఉచిత ఆర్‌టిపిసిఆర్‌ టెస్ట్‌ చేయించుకోవడం ఎలా?

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 1. ఉదయం 6:00 గంటల‌కు ఆధార్‌ కార్డ్‌ మరియు ఇఎస్‌ఐ ఫాం తీసుకొని లైన్లో నిలుచుంటే మనకు ఒక టోకెన్‌ ఇస్తారు. 2. టోకెన్‌ తీస్కొని 9:00 లోపలికి వెళ్తే డాక్టర్‌ మనకు ఏం ల‌క్షణాలు ఉన్నాయి అని అడిగి ఒక ఫామ్‌ ఇస్తారు. 3. ఫామ్‌ లో మన వివరాలు మరియు ఆధార్‌, సెల్‌ నంబర్‌ రాసి ఇవ్వాలి. 4. అక్కడే ఉన్న మరొక కౌంటర్‌ కి వెళ్లి ఆన్‌లైన్‌లో మన ...

Read More »