Breaking News

కరోనా ల‌క్షణాలు ఉన్నవారు ఇఎస్‌ఐ ఆసుపత్రిలో ఉచిత ఆర్‌టిపిసిఆర్‌ టెస్ట్‌ చేయించుకోవడం ఎలా?

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :
1. ఉదయం 6:00 గంటల‌కు ఆధార్‌ కార్డ్‌ మరియు ఇఎస్‌ఐ ఫాం తీసుకొని లైన్లో నిలుచుంటే మనకు ఒక టోకెన్‌ ఇస్తారు.


2. టోకెన్‌ తీస్కొని 9:00 లోపలికి వెళ్తే డాక్టర్‌ మనకు ఏం ల‌క్షణాలు ఉన్నాయి అని అడిగి ఒక ఫామ్‌ ఇస్తారు.
3. ఫామ్‌ లో మన వివరాలు మరియు ఆధార్‌, సెల్‌ నంబర్‌ రాసి ఇవ్వాలి.
4. అక్కడే ఉన్న మరొక కౌంటర్‌ కి వెళ్లి ఆన్‌లైన్‌లో మన వివరాలు నమోదు చేయించుకోవాలి.
5. వారు వివరాలు నమోదు చేసుకొని మనకు ఒక కిట్‌ ఇస్తారు, అక్కడే ఉన్న హెల్త్‌ వర్కర్‌ మనకు టెస్ట్‌ చేస్తారు.
6. చేసిన ఆర్‌టిపిసిఆర్‌ టెస్ట్‌ సమాచారం మన మొబైల్‌కు 24 గంటల‌ నుండి 48 గంటల‌లో మనకు మెసేజ్‌ వస్తుంది.

Check Also

నిల‌కడగా సిఎం ఆరోగ్యం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుకి సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో ...

Comment on the article