Breaking News

కోవిడ్‌ చికిత్సకు మోడల్‌ స్కూల్స్‌, కెజిబివిలు, సంక్షేమ గురుకులాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వైరస్‌ ఉద్ధృతికి అనుగుణంగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల‌ను చికిత్సలు అనుగుణంగా మార్చుకోవడమే కాకుండా డివిజన్‌ స్థాయిలో మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవిలు, సంక్షేమ గురుకులాల‌ను కరోనా వైరస్‌ చికిత్స కొరకు ఇప్పటికే ఉపయోగిస్తున్నామని అదేవిధంగా క్వారంటైన్‌ కేంద్రాలుగా వాడుకుంటున్నామని తెలిపారు. అవసరాన్ని బట్టి మిగతా భవనాల‌ను కూడా ఇందు కొరకు వాడుకుంటామని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు.

జిల్లాలోని సంక్షేమ శాఖ గురుకులాల్లో, మోడల్‌ స్కూల్స్‌ లో, కేజీబీవీలో 2,200 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయని అవసరమైన సదుపాయాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సిద్ధం చేసుకొని వాటిని ఎప్పుడు అవసరమైన కోవిడ్‌ చికిత్స కోసం ఉపయోగించుకోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాల‌ని అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని ఆ దిశగా అధికారుల‌ను కూడా సిద్ధంగా ఉండవల‌సిందిగా ఆదేశించామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

అయితే డిచ్‌పల్లిలోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ని ఉపయోగించుకోవడం లేదని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న దానిపై కలెక్టర్‌ పై విధంగా స్పందించారు. అందుబాటులో ఉన్న పైన తెలిపిన భవనాల‌ను ఉపయోగించుకున్న తర్వాత కూడా ఇంకా అవసరమైతే క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీని కూడా ఉపయోగించుకోవడానికి కూడా జిల్లా యంత్రాంగం తప్పనిసరిగా ఆలోచిస్తుందని ఆయన వివరణ ఇచ్చారు.

కరోన వైరస్ ల‌క్షణాలు ఉన్నట్లు ఎవరైనా భావిస్తే వెంటనే వైద్యుల‌ను సంప్రదించి వారి సూచన మేరకు నడుచుకోవాల‌ని ఆయన జిల్లా ప్రజల‌కు సూచించారు. అందువ‌ల్ల‌ జిల్లా ప్రజలు కరోనా చికిత్స విషయంలో ఆందోళన చెందవద్దని, పుకార్లను నమ్మవద్దని, ఎవరికి వారు అన్ని జాగ్రత్తల‌తో‌ ఉండాల‌ని తప్పనిసరి అయితేనే మాస్కు ధరించి, శానిటైజర్‌ ఉపయోగించి బయటకు వెళ్లాల‌ని కోరారు.

ఏవైనా అనుమానాలుంటే లేదా కోవిడ్‌ విషయంలో సల‌హాలు అవసరమైతే జిల్లా యంత్రాంగం ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి కంట్రోల్‌ రూమ్‌ 08462220183 ఫోన్‌ నెంబర్‌ కానీ డివిజన్‌ స్థాయిలో అయితే నిజామాబాద్‌ డివిజన్‌ 8309219718, బోధన్‌ డివిజన్‌ 08467 222001, ఆర్మూర్‌ డివిజన్‌లో అయితే 08463295050 నంబర్లకు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవాల‌ని ఆయన కోరారు.

Check Also

పనుల్లో అలసత్వం వహిస్తే బిల్లులు నిలిపివేస్తాం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కౌలాస్‌ నాలా, నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article