Breaking News

టీకా కంటే ముందే రక్తదానం చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా టీకా వేయించుకోవడానికి ముందే యువకులు రక్తదానానికి ముందుకు రావాల‌ని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 18 సంవత్సరాల‌ నుండి 45 సంవత్సరాల‌ లోపు వారందరికీ కీ మే 1 నుండి వేయడం జరుగుతుందని, టీకా తీసుకున్న 60 రోజుల‌ వరకు రక్తదానం చేయడానికి అవకాశం ఉండదనీ కావున దీనిని దృష్టిలో పెట్టుకుని రక్తదానానికి ముందుకు రావాల‌ని ఆపదలో ఉన్నవారికి మానవతా దృక్పథంతో స్పందించి వారి ప్రాణాల‌ను కాపాడాల‌ని అన్నారు.

ధర్మారావు పేట గ్రామానికి చెందిన సంతోష్‌ రెడ్డి శనివారం వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వీరికి కామారెడ్డి రక్తదాతల‌ సమూహం తరఫున అభినందనలు తెలిపారు. వీరి స్ఫూర్తితో రక్తదానం చేయాల‌నుకున్నవారు 9492874006 సంప్రదించాల‌న్నారు. కార్యక్రమంలో వి.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article