Breaking News

ఖాళీగా ఉన్న స్థానిక ఎన్నికల‌కు సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని 56 గ్రామ పంచాయతీల‌లో ఖాళీగా ఉన్న నాలుగు సర్పంచ్‌ 77 వార్డ్‌ మెంబర్‌ ఎన్నికల‌కు విధులు నిర్వహించే పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్ ‌ల‌త ఆధ్వర్యంలో శనివారం ఈ ప్రక్రియ నిర్వహించారు.

అదనపు సిబ్బందితో కలిపి 106 మంది 106 మంది ప్రిసైడింగ్‌ అధికారులు 119 మంది అదనపు పోలింగ్‌ సిబ్బంది నియామకం గురించి ఈ ప్రక్రియ పూర్తి చేశారు. 26వ తేదీన సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎన్నికల‌కు సంబంధించి ఇంకా షెడ్యూల్‌ రావల‌సి ఉన్నది. కార్యక్రమంలో డిపిఓ జయసుధ, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article