Breaking News

ఈదురు గాలుల‌తో నేల‌కొరిగిన నువ్వు పంట

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలో గురు, శుక్ర వారాల‌లో వచ్చిన ఈదురుగాలుల‌తో చేతికొచ్చిన నువ్వు పంట నువ్వు కర్రకు నువ్వు కాయలు కాసి పసుపు రంగుకు వచ్చిన సమయంలో ఈదురు గాలులు వచ్చి పంట నేల‌కు ఒరగడంతో రైతు నష్టాల‌కు గురవుతున్నారు. మోర్తాడ్‌ మండలంలో పాలెం తొర్తి తిమ్మాపూర్‌, సుంకేటు, మోర్తాడ్‌ గ్రామాల‌లో నువ్వు పంటకు చాలా నష్టం వాటిల్లిందని స్థానిక రైతులు తెలిపారు.

ఒక దిక్కు కరోనాతో ప్రజలు అల్లాడి పోతుంటే మరో దిక్కు రైతులు ప్రకృతి విల‌యతాండవం చేయడంతో వారు పండించిన పంటలు వరి, సజ్జలు, నువ్వు పంట తదితర పంటలు నష్టపోయి రైతులు నష్టాల‌ ఊబిలోకి జారిపోతున్నారు. కరోనా మహమ్మారితో ప్రజలు భయపడి చస్తుంటే ప్రకృతి సహకరించక రైతన్నలు పంటలు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని స్థానిక ప్రజలు అంటున్నారు.

చేతికొచ్చిన పంటలు నష్టపోతున్నందున ప్రభుత్వ సంబంధిత అధికారులు పంటను పరిశీలించి ప్రభుత్వం ద్వారా తమకు సహాయం అందించవల‌సిందిగా రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Check Also

ఏ కారణం చేత ఫ్యాక్టరీ మూతపడింది…

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సారంగాపూర్‌ నిజాం కో-ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీని జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article