Breaking News

27న ప్రచారం ముగించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 30 వ తేదీన బోధన్‌ మున్సిపాలిటీ లోని 18 వ వార్డ్‌కు ఎల‌క్షన్‌ జరగనున్నందున రాష్ట్ర ఎన్నికల‌ కమిషన్‌ ఆదేశాల‌ మేరకు 72 గంటల‌ ముందుగా అనగా 27వ తేదీ సాయంత్రం 5 గంటల‌ లోగా ప్రచారం ముగించాల‌ని స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్ ల‌త తెలిపారు.

శనివారం రాష్ట్ర ఎన్నికల‌ కమిషనర్‌ పార్థసారధి మున్సిపల్‌ ఎన్నికలు జరిగే జిల్లా అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారని, ఈ సందర్భంగా పోటీచేసే అభ్యర్థులు కానీ రాజకీయ పార్టీలు కానీ 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల‌లోగా ప్రచారం ముగించాల‌ని ఆదేశించారని తెలిపారు.

కావున బోధన్‌ మున్సిపాలిటీ 18 వ వార్డు పోటీచేసే అభ్యర్థులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రచారాన్ని ముగించాల‌ని పేర్కొన్నారు.

Check Also

బోధన్‌లో న‌ల్ల‌జెండాల‌తో ప్రదర్శన

బోధన్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐకేఎస్‌సీసీ పిలుపు మేరకు బోధన్‌ పట్టణంలో సీపీఐ (ఎం- ...

Comment on the article