Breaking News

నిజామాబాద్‌ జిల్లాలో కరోనాతో ఇద్దరు జర్నలిస్టుల‌ మృతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా ఇప్పటి వరకు నిజామాబాద్‌ జిల్లాలో ముగ్గురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా నిజామాబాద్‌ నియోజకవర్గంలోని ధర్పల్లి మండల‌ సాక్షి దినపత్రిక పాత్రికేయుడు అల్లాడి శేఖర్‌ (48) అదేవిధంగా నిజామాబాద్‌ రూరల్ ఎల‌క్ట్రానిక్‌ మీడియా టివి-5 పాత్రికేయుడు వేణుగోపాల్‌ (49)లు కరోనాతో శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు.

గత వారం రోజుల‌ క్రితం వీరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా అల్లాడి శేఖర్‌ ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స పొందగా వేణుగోపాల్‌ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం అర్ధరాత్రి వీరిద్దరు మృతి చెందారు. వీరి మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటు అని టియుడబ్ల్యుజె ఐజెయు జిల్లా ప్రధాన కార్యదర్శి అంగిరేకుల‌ సాయిలు అన్నారు. వీరి మృతి పట్ల జిల్లా కమిటీ తీవ్ర సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబాల‌కు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది.

ఇటీవల‌ నందిపేట్‌ మండల‌ ఆంధ్రభూమి సీనియర్‌ రిపొర్టర్‌ ధర్శనం అశోక్‌ మృతి చెందిన విషయం విదితమే. ఆర్థిక పరంగా వెనుకబడి, కరోనా బారిన పడి మృతి చెందిన పాత్రికేయుల‌ను రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మీడియా అకాడమీ అన్ని విధాల‌ ఆదుకోవాల‌ని కోరారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article