Breaking News

గల్ఫ్‌లో ఎగవేసిన జీతాలు ఇలా పొందవచ్చు !

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా సందర్బంగా గల్ఫ్‌ తదితర దేశాల‌ నుండి వాపస్‌ వచ్చిన వల‌స కార్మికుల‌కు వారి యాజమాన్యాల‌ నుండి రావల‌సిన జీతం బకాయిలు, బోనస్‌, పిఎఫ్‌, గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ బెనిఫిట్స్‌’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) ఇప్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాల‌ని ప్రవాసి మిత్ర లేబర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్‌ పరికిపండ్ల ఒక ప్రకటనలో కోరారు.

‘జస్టిస్‌ ఫర్‌ వేజ్‌ తెఫ్ట్‌’ (జీతం దొంగతనం గురించి న్యాయం చేయాలి) అనే నినాదంతో కొన్ని అంతర్జాతీయ సంస్థలు చేపట్టిన ఉద్యమంలో భాగంగా తాము వాపస్‌ వచ్చిన వల‌స కార్మికుల‌కు వారి హక్కుల‌ గురించి అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్వదేశ్‌ తెలిపారు. మంచిర్యాల‌ జిల్లాలో విదేశీ వల‌సలు ఎక్కువగా ఉన్న జన్నారం, దండేపల్లి, ల‌క్షెట్టిపేట మండలాల్లో ప్రయోగాత్మకంగా డేటా సేకరణ చేస్తున్నామని ఆయన తెలిపారు.

విదేశాల‌లోని భారతీయ రాయబార కార్యాల‌యాలు, న్యాయ సహాయ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల‌ సహకారంతో విదేశీ లేబర్‌ కోర్టులో న్యాయ పోరాటానికి కావల‌సిన ‘లీగల్‌ ఎయిడ్‌’ (న్యాయ సహాయం) పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నామని స్వదేశ్‌ తెలిపారు. గల్ఫ్‌ తదితర దేశాల‌లోని కంపెనీ నుండి జీతం బకాయిలు రాబట్టుకోవడానికి బాధితులు తమ వివరాల‌ను ప్రవాసి మిత్ర హెల్ప్‌ లైన్‌ వాట్సాప్‌ నెంబర్‌ ం91 62817 63686 కు పంపించాల‌ని ఆయన కోరారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article