Breaking News

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గిర్నీ తండాలో సర్పంచ్‌ చందర్‌, నాయకులు రెడ్యానాయక్‌, గ్రామస్తులు అందరూ కసి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టు లోకి నీరు చేరడంతో హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తోనే గ్రామాల‌ అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవల‌, రాము, అబ్బార్‌ సింగ్‌, నర్సింగ్‌, తదితరులు ఉన్నారు.

Check Also

మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి వంద శాతం ...

Comment on the article