Breaking News

కరోనా నివారణకు ప్రజలు సహకరించాలి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల‌కు ప్రజలు అందరూ సహకరించాల‌ని మోర్తాడు ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌ అన్నారు ఆయన ఆదివారం మాట్లాడుతూ మోర్తాడ్‌ మండలంలో కూడా అన్ని గ్రామాల‌లో ప్రజలు కరోనా నివారణకు చేపట్టిన చర్యల‌కు అనుకూలంగా మసులుకుంటూ అధికారుల‌కు సహాయ సహకారాలు అందివ్వాల‌న్నారు.

దేశంలో కోవిద్‌ 19 సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని అందువ‌ల్ల‌నే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఎస్సై సురేష్‌ కుమార్‌ వివరించారు. రాష్ట్రంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ రాత్రి పూట కర్ఫ్యూకు ఉత్తర్వులు జారీ చేసిందని రోజు రాత్రి 9 గంటల‌ నుండి ఉదయం 5 గంటల‌ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. అత్యవసర సేవల‌కు తప్ప మిగతా అన్ని రకాల‌ సమస్యల‌కు కర్ప్యూ అమలులో ఉంటుందన్నారు.

ప్రజల‌కు మండలంలోని అన్ని విభాగాల‌ అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాల‌ని, మండలంలోని అన్ని గ్రామాల‌ ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాల‌ని ఎవరు కూడా మాటిమాటికీ బయటకు రాకూడదు, తప్పనిసరి పరిస్థితుల్లో అవసరమైతేనే బయటకు రావాల‌ని అనవసరంగా బయట తిరుగుతే కఠినమైన చర్యలు చేపడతామని ఎస్సై సురేష్‌ కుమార్‌ హెచ్చరించారు.

Check Also

ఈజీఎస్‌ పనులు పరిశీలించిన ఎంపీడీవో

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో జరుగుతున్న ఈజీఎస్‌ పనుల‌ను శనివారం ...

Comment on the article