Breaking News

టేక్రియాల్‌లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న సమయంలో ప్రజలు అనేకమంది కరోనా బారిన పడి వైద్య చికిత్సలు పొందుతున్న విషయం తెలిసిందే. కాగా కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణ పరిధిలోని 13 వ వార్డులో ఆదివారం నంగునూరు నాగరాజు (48) అనే వ్యక్తి కరోనా బారిన పడి మృతి చెందాడు. అంతేకాకుండా మరికొంతమంది కోవిడ్ ల‌క్షణాలు ఉన్నవారు ఇప్పటికే వైద్య సహాయం పొందుతున్నారు.

కరోనా కోసం టేక్రియల్‌ గ్రామ ప్రజలు నంగునూరు నాగరాజు చిత్రపటానికి స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి రోజు ఉదయం నుండి మధ్యాహ్నం 11 గంటల‌ వరకు వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవాల‌ని, అదేవిధంగా భౌతిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్కు ధరించాల‌ని నిర్ణయించారు. మాస్కు లేకుండా ఎవరైనా తిరిగితే వారికి జరిమానా విధించడం జరుగుతుందని గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ దూలం నారాయణ తెలిపారు.

11 గంటల‌ నుండి సాయంత్రం నాలుగు గంటల‌ వరకు వ్యాపార సముదాయాలు మూసి ఉంచాల‌ని, అనంతరం 4 గంటల‌ నుండి రాత్రి 8 గంటల‌ వరకు వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవచ్చన్నారు. కానీ మాస్కు ధరించకుండా దుకాణాల‌ వద్ద కొనుగోలుకు వచ్చిన వారికి ఎటువంటి సరకులు ఇవ్వరాదని తెలిపారు. సెల్ఫ్‌ లాక్‌డౌన్‌లో ఎమర్జెన్సీ వారికి సడలింపు ఉంటుందని తెలిపారు. దీనికి గ్రామస్తులందరూ ఏకీభవించి తీర్మానం చేశారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article