Breaking News

కరోన నుంచి కోలుకోవాల‌ని పూజలు

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆల‌యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌లు కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాల‌ని తెలంగాణ రాష్ట్ర నాయకులు పెద్ద పట్లోళ్ల సిద్ధార్థ రెడ్డి, గ్రామ ప్రజల‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తానని ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు గుండయ్య, బోయిని సాయిలు, బోయిని హరిన్‌, బోయిని రాజయ్య, గరబోయిన సాయిరాం, ద్యామగారి ఆగమయ్య, బోయిని గాల‌య్య, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి వంద శాతం ...

Comment on the article