Breaking News

కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల‌కు శ్రద్ధాంజలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల‌కు రెండు నిమిషాలు మౌనం పాటించి ఆర్మూర్‌ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షు గుమ్మడి శంకర్‌తో పాటు ప‌లువురు జర్నలిస్టులు శ్రద్ధాంజలి ఘటించారు. పట్టణంలోని మెడికల్‌ అసోసియేషన్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ముఖ్యఅతిథిగా శంకర్‌ హాజరై మాట్లాడుతూ నెల‌ రోజుల‌ వ్యవధిలో జిల్లాలో నలుగురు జర్నలిస్టులు మృతి చెందడం బాధాకరమన్నారు. విధి నిర్వహణలో భాగంగా వార్త సేకరణ విషయమై ఉండగా కరోనా వ్యాధి బారిన పడి మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్మూర్‌ పట్టణానికి చెందిన రాచర్ల రాజేశ్వర్‌ వివిధ పత్రికల‌లో రిపోర్టర్‌గా పనిచేసి ఎడిటర్‌ స్థాయికి ఎదిగారన్నారు. నిన్న మొన్నటి వరకు తమతో కలిసి తిరిగిన వ్యక్తి నేడు కనిపించని లోకాల‌కు వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట గ్రామానికి చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ దర్శనం అశోక్‌ పది రోజుల‌ క్రితం మృత్యువాత పడ్డాడని, టీవీ 5 రిపోర్టర్‌గా పనిచేసిన వేణు, సాక్షి రిపోర్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శేఖర్‌ ఆకస్మికంగా మృతి చెందడం బాధించిందని చెప్పారు.

కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు కొడే స్వామి, సైఫ్‌ అలీ, నరేందర్‌, పొన్నా చంద్రశేఖర్‌, విద్యాసాగర్‌, గోలి పురుషోత్తం, రాజేందర్‌ శ్రద్ధాంజలి ఘటించారు. వారి జ్ఞాపకాల‌ను నెమరు వేసుకున్నారు. వారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. జర్నలిస్టులు సూరిబాబు, ఉమారావు, వంశీకృష్ణ, వెంకటేశం, జనార్ధన్‌, సంజీవ్‌ అజీమ్‌, శ్రావణ్‌, గణేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

అందరు తప్పక వ్యాక్సిన్‌ తీసుకోవాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భారతీయ జనతా పార్టీ మాక్లూర్‌ మండల‌ శాఖ ...

Comment on the article