Breaking News

కనికరించని కరోనా – పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పెరిగిపోతుంది. దీనివ‌ల్ల‌ రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో చాలామంది పిట్టల్లా రాలిపోతున్నారు. గ్రామాల్లో కరోనా వైరస్‌ సోకిన వారు మరణిస్తూ ఉంటే కొందరేమో వైరస్‌ సోకుతుందేమోనని భయంతోనే మరణిస్తున్నారని మోర్తాడ్‌ సర్పంచ్‌ భోగ ధరణి ఆనంద్‌ అన్నారు. కరోనా వైరస్‌కు ప్రజలు ఎవ్వరు భయపడవద్దని, డాక్టర్లు చెప్పిన విధంగా మాస్కులు ధరించి, వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాల‌ని సూచించారు.

ప్రజలు ఎవ్వరు కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళవద్దని అత్యవసరమైతేనే బయటకు రావాల‌ని, వచ్చిన వారు తిరిగి ఇంటికి వెళ్లగానే సరిగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవాల‌ని ఆమె వివరించారు. తాండావాసులు అలాగే రైతులు ఎండలో పొలం పనికి వెళ్లేవారు తల‌కు రుమాలు చుట్టుకొని వెళ్లాల‌ని సూచించారు.

గ్రామంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి ఒక్కరూ కరోనా టెస్ట్‌ చేయించుకోవాల‌ని, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా టెస్ట్‌ చేయించుకుని ప్రాణాలు బలి కాకుండా కాపాడుకోవాల‌ని, ప్రభుత్వ నిబంధనల‌కు విరుద్దంగా ఎవరు కూడా నడచుకోకూడదన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించి మన ప్రాణాలు మనం కాపాడుకుందామని పేర్కొన్నారు.

Check Also

22న సర్వసభ్య సమావేశం

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌యంలో ఈ నెల‌ ...

Comment on the article