Breaking News

కరోనాతో వీఆర్‌ఏ మృతి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని తహసిల్‌ కార్యాల‌యంలో గత కొన్ని సంవత్సరాల‌ నుండి విఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్న దని సాయన్న మండలంలోని గాండ్లపేట గ్రామ వాస్తవ్యుడు. కాగా సాయన్నకు కోవిడ్‌ సోకడంతో నిజామాబాద్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం మరణించినట్లు మోర్తాడ్‌ డిప్యూటీ తహసీల్దార్‌ సుజాత తెలిపారు.

సాయన్న మోర్తాడ్‌ మండలంలో గత 30 సంవత్సరాల‌ పైబడి పనిచేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. సాయన్న మృతితో మోర్తాడ్‌ మండలంలోని ఆయాగ్రామాల‌ ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయన్న సేవల‌ను గుర్తుచేసుకున్నారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల‌ని కోరారు.

Check Also

22న సర్వసభ్య సమావేశం

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌యంలో ఈ నెల‌ ...

Comment on the article