Breaking News

డాక్టర్లు కావలెను

కామారెడ్డి, ఏప్రిల్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో అలాగే జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి పరిధిలోని ఆయా పిహెచ్‌సిల‌లో కోవిడ్‌ 19 ఐసోలేషన్‌ వార్డులలో పనిచేయడానికి మూడునెల‌ల కొరకు కాంట్రాక్టు పద్దతిలో పనిచేయుటకు అర్హులైన వైద్యులు కావాల‌ని కామారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పిఏఎస్‌ అనస్తియస్ట్‌ ఒక పోస్టు, సిఏఎస్‌ జనరల్‌ మెడిసిన్‌ ఒక పోస్టు, సిఏఎస్‌ జిడిఎంవో ఒక పోస్టు జిల్లా ఆసుపత్రి కామారెడ్డిలో అవకాశముందన్నారు. అలాగే పిహెచ్‌సిలో సిఏఎస్‌ జిడిఎంవో నాలుగు పోస్టులు ఉన్నాయన్నారు. ఆసక్తిగల‌ వారు ఈనెల‌ 30న మధ్యాహ్నం 3 గంటల‌కు సంబంధిత సర్టిఫికెట్లతో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యం నందు ఇంటర్వ్యూల‌కు హాజరు కావాల‌న్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article