Breaking News

పటిష్ట మైన బందోబస్తు ఏర్పాట్లు

బోధన్‌, ఏప్రిల్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌లో వార్డ్‌ నెంబర్‌ 18 శ్రీనివాస్‌ నగర్‌ కాంప్‌, ధ్యాకం గల్లీలో ఈనెల‌ 30 న జరిగే మున్సిపాలిటి బై ఎల‌క్షన్‌ పోలింగ్‌ కేంద్రాల‌ వద్ద మరియు రాకాసి పేట్‌ వద్ద గల‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద తీసుకోవల‌సిన పటిష్ట బందోబస్తు మరియు భద్రత చర్యల‌ గురించి నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ పరిశీలించారు.

అనంతరం తీసుకోవల‌సిన జాగ్రత్తల‌ గురించి సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీచేశారు. సిపి వెంట బోధన్‌ ఏసిపి ఎన్‌. రామా రావు, బోధన్‌ ఎస్‌హెచ్‌వో ఎస్‌.రామన్‌, బోధన్‌ రూరల్‌ సిఐ రవీందర్‌ నాయక్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్‌పెక్టర్‌ రాఘవేంద‌ర్‌ ఉన్నారు.

Check Also

ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్ట బడుతుంది

బోధన్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ పాల‌నలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఐఎఫ్‌టీయూ జిల్లా ...

Comment on the article