Breaking News

అధిక వసూలు చేస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అంబులెన్స్‌ డ్రైవర్లు అధిక రుసుము వసూలు చేస్తే చర్యలు తీసుకోవాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆదేశించినట్లు కామారెడ్డి ఆర్‌టివో వాణి ఒక ప్రకటనలో తెలిపారు. అంబులెన్స్‌ డ్రైవర్లు కోవిడ్‌ రోగుల‌ బంధువుల‌ వద్ద అధిక రుసుము వసూలు చేస్తే సెల్‌ నెంబర్‌ 9959106776 కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాల‌ని ఆమె కోరారు.

నిబంధనలు ఉల్లంఘించి అధిక సొమ్ము వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాల‌ని ఆమె కోరారు. పూర్తి వివరాల‌కు జిల్లా కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 7382929350 ను సంప్రదించాల‌ని సూచించారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article