Breaking News

పోలీసువారి హెచ్చరిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ 1వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నకిలీ రెమిడెసివియర్‌ ఇంజక్షన్‌ కరోనా రోగుల‌కు విక్రయించిన ఇద్దరు వ్యక్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. వాడిన రెమిడెసివియర్‌ సీసాలో సిలేన్‌ వాటర్‌ పోసి కరోనా రోగుల‌కు విక్రయించి మోసం చేసిన వారిపై కేసు నమోదు చేసి రినూండ్‌కు తరలించడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నిజామాబాద్‌ 4వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అధిక ధరల‌కు (1 ఇంజక్షన్‌ రూ. 60,000కు) రెమిడెసివియర్‌ మందును విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల‌ను పోలీసులు అదుపులోకి తీనుకుని విచారిసున్నారు. కోవిడ్‌ పరిస్థితుల‌ దృష్ట్యా కరోనా రోగుల బల‌హీనతను ఆసరాగా చేసుకొని కొందరు మోసగాళ్లు, రెమిడెసివియర్‌ లాంటి మందును కల్తిచేసి లేదా అధిక ధరకు విక్రయిస్తున్న నేపథ్యంలో అటువంటి వారి గురించి పోలీసుల‌కు సమాచారం ఇస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉంటు ఎవ్వరయిన రెమిడెసివియర్‌ కోవిడ్‌ చికిత్సకు అవసరమైన మందును అక్రమ నిలువ‌ ఉంచిన, అధిక ధరకు విక్రయించిన, లేదా కల్తీ చేసి ప్రజల‌ను మోసం చేసినా అటువంటి వారి సమాచారం పోలీసుల‌కు తప్పని సరిగా ఇవ్వాల‌ని, అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రజల‌కు విజ్ఞప్తి చేశారు. ప్రజలు సమాచారం అందించవల‌సిన ఫోన్‌ నెంబర్‌ 94906 18000.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article