Breaking News

ప్రజావాణి రద్దు – ఫోన్‌ ఇన్‌లో ఫిర్యాదులు

కామారెడ్డి, మే 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు అయిన సందర్భంగా ప్రజలు తమ ఫిర్యాదుల‌ను అందజేయడానికి జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యానికి రాకుండా తమ ఫిర్యాదుల‌ను ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల‌నుండి మధ్యాహ్నం 12 గంటల‌ వరకు ఫోన్‌ నెంబర్‌ 08468220044 ద్వారా తమ ఫిర్యాదుల‌ను అందజేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల‌ను సంబంధిత శాఖల‌ అధికారుల‌ ద్వారా పరిష్కరించడం జరుగుతుందని, కావున ప్రజలంతా ఇట్టి విషయాన్ని గమనించాల‌ని ఆయన ప్రకటనలో కోరారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article