Breaking News

కరోన బాధితుడికి ప్లాస్మా అందజేత

కామారెడ్డి, మే 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రక్తదాతల‌ సమూహం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోణ వ్యాధిగ్రస్తుని బి పాజిటివ్‌ ప్లాస్మాను రష్‌ బ్లడ్‌ బ్యాంక్‌ నిర్వాహకులు చిరంజీవి సహకారంతో బి పాజటివ్‌ ప్లాస్మాను అందజేసి ప్రాణాల‌ను కాపాడడం జరిగిందని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు.

ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో కరోనా వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడాలంటే ప్లాస్మాతోనే సాధ్యమని, కరోనా వచ్చి తగ్గిన వారు 28 రోజుల‌ నుండి 90 రోజుల కాల‌ వ్యవధిలో నెల‌కు రెండు సార్లు ప్లాస్మా దానం చేయవచ్చన్నారు. ప్లాస్మా ద్వారా కరోణను ఎదుర్కొనగలిగే యాంటీ బాడీలు అభివృద్ధి చెంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారినీ కాపాడవచ్చని, ప్రతి రోజూ వందలాది మంది కరోనాతో చనిపోతున్నారని వారిని కాపాడడానికి ప్లాస్మాదానం చేయాల‌ని విజ్ఞప్తి చేశారు.

ఇప్పటివరకు 50 యూనిట్ల ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అందజేయడం జరిగిందన్నారు. ప్లాస్మాదానము చేయాల‌నుకునేవారు 9492874006 నంబర్‌కి సంప్రదించాల‌న్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article