Breaking News

అక్రమాల‌కు పాల్ప‌డే ఆసుపత్రుల‌ నుండి సంజాయిషీ తీసుకోవాలి

నిజామాబాద్‌, మే 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమాల‌కు పాల్ప‌డే ఆసుపత్రుల‌ నుండి సంజాయిషీ తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. రెమిడెసివర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ వాడకంపై ప్రైవేటు ఆసుపత్రుల‌లో తనిఖీ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కమిటీ అధికారులు నిజామాబాద్‌ నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల‌లో శుక్రవారం, శనివారం తనిఖీలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేశారు. వారి నివేదిక ప్రకారం అక్రమాల‌కు పాల్ప‌డిన ఆసుపత్రుల‌పై సంజాయిషీ కోరాల‌ని కలెక్టర్‌ డిఎంఅండ్‌ హెచ్‌వో ను ఆదేశించారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article