Breaking News

Daily Archives: May 4, 2021

ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాల‌ని సివిల్‌ సప్లయ్‌, సహకార శాఖ, వ్యవసాయ శాఖ అధికారుల‌ను జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. మంగళవారం బాన్సువాడ మండల‌ అభివృద్ధి అధికారి కార్యాల‌యంలో డివిజన్‌ స్థాయి సమీక్షా సమావేశంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను కొనుగోలు కేంద్రాల‌ వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా నిర్వహించి రైతులు నష్టపోకుండా చూడాల‌ని ఆదేశించారు. ప్రమాణాల‌ మేరకు ధాన్యం కొనుగోలు చేపట్టాల‌ని, కొనుగోలు కేంద్రాల‌ ...

Read More »

పాజిటివ్ ల‌క్షణాలున్న ప్రతి ఒక్కరికి ఐసోలేషన్‌ కిట్స్‌

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాజిటివ్ ల‌క్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి హోమ్‌ ఐసొలేషన్‌ కిట్స్‌ అందించాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ వైద్య అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం బాన్సువాడ మండల‌ అభివృద్ది అధికారి కార్యాల‌యంలో ఆర్డిఓ రాజాగౌడ్‌, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ మోహన్‌బాబు, తహశీలుదార్లు, మండల‌ స్పెషల్‌ ఆఫీసర్లు, పోలీసు అధికారుల‌తో డివిజన్‌ స్థాయి సమావేశంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల‌ వారిగా కరోనా పరీక్షలు, వాక్సినేషన్‌, కరోనా నియంత్రణ చర్యల‌పై జిల్లా కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ...

Read More »

నిర్ణయించిన చార్జీలు మాత్రమే వసూలు చేయాలి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ప్రైవేటు ల్యాబ్‌ యాజమానులు కరోనా టెస్టుల‌ పేరుతో ఇష్టానుసారంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నందున జిల్లా కలెక్టర్‌ జిల్లా వ్యాప్తంగా ఆరు టాస్క్‌ ఫోర్స్‌ టీంల‌ను ఏర్పాటు చేసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. 23 కేంద్రాల‌లో తనిఖీలు చేసి కొన్ని కేంద్రాల‌లో సరియైన సౌకర్యాలు కల్పించట్లేదని విచారణలో తేలింది. వీటి విషయమై విచారణ అనంతరం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ...

Read More »

ఆన్‌లైన్‌ రిజిష్టర్‌ చేసుకున్నవారికే టీకాలు

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారికే కోవిడ్‌ వ్యాక్సిన్‌ టీకాలు వేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 45 సంవత్సరాలు పై బడిన వారు ప్రతి ఒక్కరు కోవిన్‌ యాప్‌లో పేరు నమోదు చేసుకోవాల‌న్నారు. వివరాలు నమోదు చేసుకున్నవారికి కేటాయించిన తేదీల్లో సంబంధిత కేంద్రాల్లో టీకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 42 సెంటర్లు ఉన్నాయని, నచ్చిన సెంటర్‌ను ఎంపిక చేసుకొని అక్కడికి వెళ్లి టీకా తీసుకోవచ్చని ...

Read More »

అధిక వసూలు చేస్తే కాల్‌ చేయండి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ప్రయివేటు అంబులెన్స్‌ యజమానులు ఇష్టానుసారంగా డబ్బు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి హెచ్చరించారు. కరోనాను అవకాశంగా చేసుకొని ప్రజల‌ నుంచి అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. కావున అంబులెన్స్‌ ఓనర్‌లు, డ్రైవర్లు తెలంగాణ మోటర్‌ వెహికల్‌ చట్టం నిబంధనలు, డిఎం ఆక్ట్‌ 2005 అనుగుణంగా డబ్బు వసూలు చేయాల‌న్నారు. నిబంధనల‌ ప్రకారం వసూల్‌ చెయ్యని యజమానుల‌పై సీరియస్‌గా చర్యలు తీసుకుంటామని ...

Read More »

రంజాన్‌ దుస్తుల‌ పంపిణీ

మోర్తాడ్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లింల‌కు అందిస్తున్న బట్టల‌ను మంగళవారం మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలోని మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌య ఆవరణలో ముస్లింల‌కు రంజాన్‌ బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల‌ ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్‌, మోర్తాడ్‌ జెడ్‌పిటిసి బద్దం రవి, తహసిల్దార్‌ శ్రీధర్‌, స్థానిక సర్పంచ్‌ భోగ ధరని ఆనంద్‌, టిఆర్‌ఎస్‌ మోర్తాడ్‌ మండల‌ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా తహసిల్దార్‌ కార్యాల‌యం జూనియర్‌ ...

Read More »

కరోనా మరణాల‌కు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ సీపీఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని ఎన్‌ఆర్‌ భవన్‌లో విలేకరుల‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా (ఇన్చార్జి) కార్యదర్శి వనమాల‌ కృష్ణ మాట్లాడుతూ కరోనా వచ్చి సంవత్సరం పైగా అవుతున్నా ఇప్పటికీ నిర్ధారణ, చికిత్స సౌకర్యాల‌ విషయంలో ప్రభుత్వాల‌ దగ్గర పరిష్కారం లేకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి కానీ ప్రజల‌కు ...

Read More »