Breaking News

అధిక వసూలు చేస్తే కాల్‌ చేయండి

నిజామాబాద్‌, మే 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ప్రయివేటు అంబులెన్స్‌ యజమానులు ఇష్టానుసారంగా డబ్బు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి హెచ్చరించారు. కరోనాను అవకాశంగా చేసుకొని ప్రజల‌ నుంచి అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. కావున అంబులెన్స్‌ ఓనర్‌లు, డ్రైవర్లు తెలంగాణ మోటర్‌ వెహికల్‌ చట్టం నిబంధనలు, డిఎం ఆక్ట్‌ 2005 అనుగుణంగా డబ్బు వసూలు చేయాల‌న్నారు.

నిబంధనల‌ ప్రకారం వసూల్‌ చెయ్యని యజమానుల‌పై సీరియస్‌గా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక వేళ రూల్స్‌కు విరుద్ధంగా వసూల్‌ చేస్తే ప్రజలు నేరుగా జిల్లా ట్రాన్స్‌పోర్టు కమీషనర్‌కు పిర్యాదు చేయవచ్చని తెలిపారు. డబ్బు ఎక్కువ ఇవ్వాల‌ని అంబులెన్సు యజమానులు, డ్రైవర్లు వేదిస్తే అధికారుల‌కు పిర్యాదు చేసినచో వారి పై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

జిల్లా ట్రాన్స్‌పోర్టు కమీషనర్‌కు ఫోన్‌ ద్వారా తెలియచేయవచ్చన్నారు. వారి యొక్క సెల్‌ 9948788445, మోటర్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ సెల్‌ నిజామాబాద్‌ 9666364494, ఆర్మూర్‌ 7330771561 , బోధన్‌ 8374488999 కు పిర్యాదు చేయవచ్చని కలెక్టర్‌ తెలిపారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article