Breaking News

ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి

కామారెడ్డి, మే 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాల‌ని సివిల్‌ సప్లయ్‌, సహకార శాఖ, వ్యవసాయ శాఖ అధికారుల‌ను జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. మంగళవారం బాన్సువాడ మండల‌ అభివృద్ధి అధికారి కార్యాల‌యంలో డివిజన్‌ స్థాయి సమీక్షా సమావేశంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను కొనుగోలు కేంద్రాల‌ వారిగా సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా నిర్వహించి రైతులు నష్టపోకుండా చూడాల‌ని ఆదేశించారు. ప్రమాణాల‌ మేరకు ధాన్యం కొనుగోలు చేపట్టాల‌ని, కొనుగోలు కేంద్రాల‌ వారిగా రోజు వారి ల‌క్ష్యాన్ని సాధించాల‌ని తెలిపారు. మిల్ల‌ర్లు లారీల‌ను వెంటనే అన్‌లోడింగ్‌ చేసేలా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల‌ వద్ద ఎలాంటి రవాణ ఇబ్బందులు ఏర్పడకుండా. మండల‌ టీములు పర్యవేక్షించాల‌ని, అవసరమైన చోట అదనంగా ట్రాక్టర్లు, లారీల‌ను ఎంగేజ్‌ చేసుకోవాల‌ని, కొనుగోళ్లకు అంతరాయం కల‌గకుండా హమాలీలు తక్కువ ఉన్న చోట అదనంగా నియమించుకోవాల‌ని, తేమ కొలిచే యంత్రాలు, తూనిక యంత్రాల‌ సమస్య లేకుండా చూడాల‌ని సూచించారు. రైతుల‌ నుండి ధాన్యం కొనుగోళ్లు చేసిన వెంటనే ట్యాబ్‌ ఎంట్రీ నమోదు చేయాల‌ని, తద్వారా రైతు ఖాతాల్లో డబ్బు జమ కావడం జరుగుతుందని, రైతులు దళారీల‌ బారిన పడకుండా, రైతుల‌ నుండి నేరుగా ధాన్యం కొని వారికి ఆర్థిక భరోసా కల్పించే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందన్నారు.

సమీక్షా సమావేశంలో ఆర్డిఓ రాజాగౌడ్‌, డిఎం సివిల్‌ సప్లయ్‌ జితేంద్ర ప్రసాద్‌, డిఎస్‌ కొండల్‌రావు, జిల్లా సహకార శాఖ అధికారి వసంత, ఎడి మార్కెటింగ్‌ రమ్య, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యల‌క్ష్మి, తహశీలుదార్లు, బాన్సువాడ ఎడిఎ చంద్రశేఖర్‌, ప్రాథమిక సహకార శాఖ సిఇఒలు, మార్కెటింగ్‌ అధికారులు, ఎఓలు, ఎఇఓలు, రైస్ మిల్ల‌ర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article