Breaking News

పాజిటివ్ ల‌క్షణాలున్న ప్రతి ఒక్కరికి ఐసోలేషన్‌ కిట్స్‌

కామారెడ్డి, మే 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాజిటివ్ ల‌క్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి హోమ్‌ ఐసొలేషన్‌ కిట్స్‌ అందించాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ వైద్య అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం బాన్సువాడ మండల‌ అభివృద్ది అధికారి కార్యాల‌యంలో ఆర్డిఓ రాజాగౌడ్‌, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ మోహన్‌బాబు, తహశీలుదార్లు, మండల‌ స్పెషల్‌ ఆఫీసర్లు, పోలీసు అధికారుల‌తో డివిజన్‌ స్థాయి సమావేశంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల‌ వారిగా కరోనా పరీక్షలు, వాక్సినేషన్‌, కరోనా నియంత్రణ చర్యల‌పై జిల్లా కలెక్టరు సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ల‌క్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఐసొలేషన్‌ కిట్స్‌ అందించాల‌ని, హోమ్‌ ఐసొలేషన్‌ వసతి లేనివారికి ప్రభుత్వ కోవిద్‌ సెంటర్లో చికిత్స అందించాల‌ని, ప్రస్తుత కోవిద్‌ సంక్షోభ తరుణంలో ఎలాంటి అల‌సత్వం ప్రదర్శించకుండా ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాల‌న్నారు. ప్రయిమరీ కాంటాక్టుగా ఫ్యామిలీ మెంబర్లకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాల‌ని, హోమ్‌ ఐసోలేషన్‌లో వుంచాల‌ని, కొన్ని చోట్ల దురదృష్టవశాత్తు హోమ్‌ ఐసోలేషన్లో వున్న బయట తిరుగుతున్నారనే విషయాల‌ను గమనించడం జరిగిందని, తహశీలుదారు, మెడికల్‌ ఆఫీసర్‌, పోలీసు ఎన్హెచ్‌ కూడిన టీములు దీనికోసం ఆశా, ఎఎన్‌ఎం సిబ్బంది, విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్లతో పాజిటివ్‌ కల్గిన వారి ఇంటిని సందర్శించాల‌ని, పాజిటివ్‌ వ్యక్తి పేరు, ఏ రోజు ఏ సమయంలో ఆ ఇంటిని సందర్శించినదీ, వారి వైద్య పరిస్థితి రిజిష్టర్లలో నమోదు చేయాల‌ని ఆదేశించారు.

హోమ్‌ ఐసొలేషన్లో వున్న పాజిటివ్‌ వ్యక్తి వేసుకునే మందుల‌ గురించి, అలాగే పాజిటివ్‌ వ్యక్తి బయట తిరిగితే జరిగే అనర్థాల‌ గురించి వారి కుటుంబ సభ్యుల‌కు అవగాహన కలిగించాల‌ని, పాజిటివ్‌ వ్యక్తి బయటకు రాకుండా వుండే విధంగా కుటుంబ సభ్యుల‌కు కౌన్సిలింగ్‌, సల‌హాలు అందించాల‌ని, ఆశా సిబ్బంది తక్కువ వున్న చోట తాత్కాలికంగా నియామకం చేసుకోవాల‌ని తెలిపారు. అలాగే కమ్యూనిటీ వాచింగ్‌ ముఖ్యమని, స్థానిక సంస్థల‌ అధికారుల‌తో హోమ్‌ ఐసొలేషన్లో వున్న వారిని గమనించాల‌ని, క్రాస్‌ చెక్‌ చేసుకోవాల‌ని, అలాగే ఆశా సిబ్బంది, గ్రామ పంచాయితీ సిబ్బంది సహాయంతో ప్రతి ఇంటిని సందర్శించి పాజిటివ్ ల‌క్షణాలున్న వారిని గుర్తించాల‌ని తెలిపారు.

వాక్సినేషన్ ల‌క్ష్యాన్ని వంద శాతం సాధించాల‌ని, విఆర్‌ఎ, విఆర్‌ఓ సహాయంతో గ్రామాల‌లో వాక్సినేషన్‌ పెంచుకోవాల‌ని సూచిస్తూ అందరు సమన్వయంతో పని చేస్తే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. బాన్సువాడ ఆసుపత్రిలో వంద కోవిద్‌ బెడ్స్‌ వసతి కలిగేలా చర్యలు తీసుకోవాల‌ని డిప్యూటీ డిఎంహెచ్‌వోకు, బాన్సువాడ లోని ప్రయివేటు ఆసుపత్రుల‌లో కోవిద్‌ బెడ్స్‌ 50 శాతం చికిత్స అందేలా క్షేత్రస్థాయి పరిశీల‌న చేయాల‌ని, అనధికారికంగా ఉన్న ఆక్సిజన్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకోవాల‌ని ఆర్డిఓ, పోలీసు అధికారుల‌కు సూచించారు.

గ్రామాల‌లో భౌతిక దూరం పాటించేలా చర్యలు ఉండాల‌ని, సమూహాలుగా తిరుగనివ్వవద్దని, అవసరమైన చోట 144 సెక్షన్‌తో కట్టడి చేయాల‌ని, దుకాణాల‌లో తప్పనిసరిగా మాస్కు కలిగిన వారికే సరుకులు విక్రయించేలా చర్యలు తీసుకోవాల‌ని, నిబంధనల‌ను అతిక్రమించిన దుకాణాదారుల‌పై చర్యలు తీసుకోవాల‌ని ఎన్‌ఫోర్సుమెంట్‌ టీముల‌ను ఆదేశించారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article