Breaking News

కరోనా మరణాల‌కు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

నిజామాబాద్‌, మే 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ సీపీఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని ఎన్‌ఆర్‌ భవన్‌లో విలేకరుల‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా (ఇన్చార్జి) కార్యదర్శి వనమాల‌ కృష్ణ మాట్లాడుతూ కరోనా వచ్చి సంవత్సరం పైగా అవుతున్నా ఇప్పటికీ నిర్ధారణ, చికిత్స సౌకర్యాల‌ విషయంలో ప్రభుత్వాల‌ దగ్గర పరిష్కారం లేకపోవడం సిగ్గుచేటన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి కానీ ప్రజల‌కు ఉపశమనం, పరిష్కారం చూపడం లేదన్నారు. కరోనా సంక్షోభానికి ప్రజల‌ మరణాల‌కు కేంద్ర ప్రభుత్వమే ప్రధాన బాధ్యత వహించాల‌న్నారు. దేశంలో ఎక్కడా కూడా ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాల‌న్నారు. అన్ని ప్రధాన ఆసుపత్రుల‌కు ఆక్సిజన్‌ ప్లాంట్లు మంజూరు చేసి, నిర్మించేలా చర్యలు తీసుకోవాల‌న్నారు.

అన్ని రాష్ట్రాల‌కు జనాభా ప్రాతిపదికన సరిపడా వ్యాక్సిన్లను యుద్ధ ప్రాతిపదికన అందించాల‌ని డిమాండ్‌ చేశారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు వెంటనే అందివ్వాల‌న్నారు. కరోనా చికిత్స విషయంలో ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రుల‌ దోపిడీపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల‌న్నారు. డిమాండ్‌కు సరిపడా వైద్య సదుపాయాలు ప్రభుత్వం కల్పించాల‌న్నారు.

అవసరమైతే పెద్ద స్థాయి ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజల‌కు చికిత్స అందించాల‌న్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా, మాస్కు ధరించి జాగ్రత్తగా ఉండాల‌న్నారు. విలేకరుల‌ సమావేశంలో న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వి.ప్రభాకర్‌, ఎం.వెంకన్న పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article