Breaking News

ఆన్‌లైన్‌ రిజిష్టర్‌ చేసుకున్నవారికే టీకాలు

నిజామాబాద్‌, మే 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారికే కోవిడ్‌ వ్యాక్సిన్‌ టీకాలు వేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 45 సంవత్సరాలు పై బడిన వారు ప్రతి ఒక్కరు కోవిన్‌ యాప్‌లో పేరు నమోదు చేసుకోవాల‌న్నారు. వివరాలు నమోదు చేసుకున్నవారికి కేటాయించిన తేదీల్లో సంబంధిత కేంద్రాల్లో టీకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

జిల్లాలో మొత్తం 42 సెంటర్లు ఉన్నాయని, నచ్చిన సెంటర్‌ను ఎంపిక చేసుకొని అక్కడికి వెళ్లి టీకా తీసుకోవచ్చని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంట‌ల‌ నుండి సాయంత్రం 4 గంట‌ల‌ వరకు టీకాలు వేస్తారని చెప్పారు. అయితే 18 సంవత్సరాలు పై బడిన వారికి ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చిన తరువాత టీకాలు వేయడం జరుగుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article