Breaking News

లాక్‌ డౌన్‌ పరిశీలించిన అధికారులు

మోర్తాడ్‌, మే 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఉదయం 10 గంటల‌ నుండి లాక్‌ డౌన్‌ విధించడంతో మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో బుధవారం వ్యాపార సంస్థలు, వివిధ దుకాణ సముదాయాలు స్వచ్చందంగా మూసి ఉంచి ప్రభుత్వ అధికారుల‌ ఆదేశాల‌కు కట్టుబడి ఉంటామని గుడిపాడు గ్రామస్తులు వివరించారు. మండలంలోని అన్ని గ్రామాల‌లో లాక్‌ డౌన్‌ ఎలా జరుగుతుందోనని ప్రభుత్వ అధికారులు పరిశీలించారు.

అన్ని గ్రామాల‌లోని దుకాణ యజమానులు ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా అన్ని దుకాణ సముదాయాలు మూసి ఉంచారు. మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో స్థానిక తహసీల్దార్‌ శ్రీధర్‌, ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌ ఎంపీడీవో శ్రీనివాస్‌ రెడ్డి లాక్‌ డౌన్‌ పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఎవరూ కూడా ప్రభుత్వ నిబంధనల‌కు విరుద్ధంగా ప్రవర్తించకూడదని అలా ప్రవర్తించినట్లయితే శిక్షార్హుల‌వుతారని తహసిల్దార్‌ శ్రీధర్‌ ప్రజల‌ను కోరారు.

Check Also

ఈజీఎస్‌ పనులు పరిశీలించిన ఎంపీడీవో

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో జరుగుతున్న ఈజీఎస్‌ పనుల‌ను శనివారం ...

Comment on the article