Breaking News

రోడ్డు ప్రమాదంలో విఆర్‌ఏ మృతి

మోర్తాడ్‌, మే 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాల‌యంలో విఆర్‌ఎ గా పనిచేస్తున్న మస్తా బాబన్న బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు మోర్తాడ్‌ తహసిల్దార్‌ శ్రీధర్‌ తెలిపారు. మోర్తాడ్‌ గ్రామానికి చెందిన విఆర్‌ఏ బాబన్న తన కుమారుడు మాస్ట ప్రాంతీష్‌ను ఆరోగ్యం బాగాలేక నిజామాబాదులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించాడు. కాగా ఆరోగ్యం క్షీణించడం వ‌ల్ల‌ అతని కుమారుడు మరణించినట్లు వైద్య సిబ్బంది తెల‌పడంతో బుధవారం జిల్లా కేంద్రం నుండి పార్థివ దేహాన్ని అంబులెన్సులో తీసుకు వస్తుండగా మార్గమధ్యంలో జక్రాన్‌ పల్లి మండల‌ కేంద్రంలో అంబులెన్స్‌కు ఇతర వాహనం ఢీ కొట్టడం వ‌ల్ల‌ విఆర్‌ఏ బాబు అన్న అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.

అంబులెన్స్‌లో వస్తున్న మిగతా వారికి కాళ్లు, చేతులు, ఎముకలు విరగడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. కుమారుని శవాన్ని తీసుకు వస్తూ తండ్రి కూడా మార్గమధ్యంలో చనిపోవడం దురదృష్టకరమని గ్రామస్తులు కంటతడిబెట్టారు. విఆర్‌ఏ కుమారుడికి చిన్న చిన్న పిల్ల‌లున్నారని, అతని భార్య కూడా ప్రమాదంలో గాయపడడం దురదృష్టకరమని అంటున్నారు. అధికారులు వారికి మెరుగైన వైద్య సేవ‌లు అందించి కుటుంబాన్ని ఆదుకోవాల‌ని కోరుతున్నారు.

Check Also

ఈజీఎస్‌ పనులు పరిశీలించిన ఎంపీడీవో

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో జరుగుతున్న ఈజీఎస్‌ పనుల‌ను శనివారం ...

Comment on the article