Breaking News

మహాత్మా బసవేశ్వరునికి ఘనంగా నివాళి

నిజామాబాద్‌, మే 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్‌ చాంబర్లో అధికారులు సిబ్బంది మహాత్మ బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని కోవిడ్‌ నిబంధనల‌తో ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ముఖ్యఅతిథిగా మహాత్మ బసవేశ్వర చిత్రపటానికి పూల‌మాల‌వేసి జ్యోతి వెలిగించి నివాళి అర్పించారు.

సాంస్కృతిక శాఖ, కలెక్టరేట్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల‌ శాఖ అధికారులు, సిబ్బంది రెవెన్యూ శాఖ అధికారులు, తహసిల్దార్‌ ప్రశాంత్‌, రమణ్‌ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొని మహాత్మునికి నివాళులు అర్పించారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article