Breaking News

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

మోర్తాడ్‌, మే 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని ఆయా గ్రామాల‌లో లాక్‌ డౌన్‌ సమయంలో ఎవరైనా ప్రభుత్వ ఆదేశాల‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మోర్తాడ్‌ పోలీసులు హెచ్చరించారు. పోలీసులు శుక్రవారం గ్రామంలోని వీధుల‌లో లాక్‌ డౌన్‌ను పరిశీలించారు. అలాగే లాక్‌ డౌన్‌ సమయంలో రోడ్డుపై సంచరించే వాహనదారుల‌ను ఆపి వివరాల‌ను సేకరించి లాక్‌డౌన్‌ సమయంలో ఎవరు కూడా బయట సంచరించరాదని తెలుపుతూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మోర్తాడ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆయా గ్రామాల‌లో ప్రజలు ఎవరూ కూడా లాక్‌డౌన్‌ సమయంలో బయట తిరగవద్దు అని అత్యవసర సమయంలో మాత్రమే బయటకు వెళ్లాల‌ని మోర్తాడ్‌ ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌ అన్నారు. ప్రభుత్వ నిబంధనలు పకడ్బందీగా అమలు అమ‌ల‌వుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కేవలం అత్యవసర సర్వీసులు ఆసుపత్రులు, మెడికల్‌ షాపులు, పెట్రోల్‌ బంకులు మాత్రమే తెరిచి ఉంచాల‌ని ప్రభుత్వం ఆదేశించిందని వివరించారు. ప్రజలు పోలీసుల‌కు అధికారుల‌కు సహకరించాల‌న్నారు.

Check Also

ఈజీఎస్‌ పనులు పరిశీలించిన ఎంపీడీవో

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో జరుగుతున్న ఈజీఎస్‌ పనుల‌ను శనివారం ...

One comment

  1. Bajayya Rengerla

    #SHO_kammarpally_ps #PSridharGoud SI cheating me after sent 2 injections order passed copies listeni… https://t.co/E6b5zDDbm0

Comment on the article