Breaking News

Daily Archives: May 15, 2021

నిజామాబాద్‌ జిల్లాలో 2 వేల‌కే సిటిస్కాన్‌

నిజామాబాద్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి సిటీ స్కాన్‌ టెస్ట్‌ తప్పనిసరి అయినందున పేద ప్రజల‌పై అధిక ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో సిటీ స్కాన్‌ టెస్ట్‌ ధరను డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లు 2 వే రూపాయలు మాత్రమే తీసుకోవాల‌ని మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌ జిల్లా సిటిస్కాన్‌ యజమాన్యాల‌ను కోరారు. ఇందూరు సిటీ స్కాన్‌ యజమాని డా.రవీందర్‌ రెడ్డి, ఆర్మూర్‌ అమృత ల‌క్ష్మీ సిటీ స్కాన్‌ డా.జయ ...

Read More »

కరోనా నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో కరోనా నియంత్రించేందుకు వైద్య, రెవిన్యూ, రవాణా, ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. శనివారం ఆయన మహారాష్ట్ర, సరిహద్దులోని చెక్‌ పోస్ట్‌ను సందర్శించారు. సోంపూర్‌, మద్దునూర్‌ సరిహద్దులో ఉండటంతో అక్కడి ప్రజలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాల‌ని స్థానిక సిబ్బందిని ఆదేశించారు. మారుమూల‌ ప్రాంతాల‌లో కోవిడ్‌ వైద్యసేవల‌ను కలెక్టర్‌ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సరిహద్దు ...

Read More »

ఉపాధి కూలీ మృతి

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎర్ర పహాడ్‌ గ్రామంలో ఇజిఇఎస్‌ పనిలో భాగంగా రోడ్లకు మొరం కొడుతున్నప్పుడు చిట్యాల బల‌వ్వ అక్కడే రోడ్డు పై మొరము లెవల్‌ చేస్తున్నపుడు ట్రాక్టర్‌ వెనుక భాగం తగిలి బాల‌వ్వ పడిపోయింది. అక్కడ నుండి ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించగా కామారెడ్డికి వెళ్ళమని చెప్పారు. అంబులెన్స్‌లో తీసుకెళ్లగా వాళ్ళు టెస్ట్‌ చేసి బాల‌వ్వ మరణించిందని చెప్పారు. బల‌వ్వకు భర్త, కొడుకు సాయిలు కూతురు సౌందర్య ఉన్నారు.

Read More »

46వ వార్డులో సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారి

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి పట్టణం 46 వార్డులో కరోన సెకండ్‌ దశలో రెండవ సారి సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయడం జరిగింది. వార్డు కౌన్సిల‌ర్‌ కోయల్‌ కార్‌ కన్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ను అందరూ సహకరిస్తూ తమ తమ ఇళ్లలోనే ఉంటూ తమ కుటుంబాన్ని కాపాడుకుంటే దేశాన్ని కాపాడినట్టేనని, అవసరం ఉంటేనే బయటకు వెళ్లండి, విధిగా మాస్కు కచ్చితంగా పెట్టుకోవాల‌ని, అలాగే చేతుల‌కు శానిటైజర్‌ కచ్చితంగా వాడాలి, కోవిడ్‌ నిబంధనలు ...

Read More »

చికిత్స అందించక డబ్బులు తీసుకొని పంపిస్తే ఆస్పత్రుల‌పై చర్యలు

నిజామాబాద్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేవలం ఫీజుల‌ కోసం కరోనా పేషెంట్లను అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందించకుండా పంపిస్తే ఆయా ఆసుపత్రుల‌పై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన తిరుమల‌, మనోరమ, ప్రతిభ ప్రైవేటు ఆసుపత్రుల‌లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంటర్ల వివరాలు రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ వివరాల‌ను రిజిస్టర్‌లో పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి యాజమాన్యాల‌తో మాట్లాడుతూ, పేషెంట్లకు సరైన చికిత్సను అందించగల‌ స్తోమత, పరిజ్ఞానము ఉంటేనే ...

Read More »

మోర్తాడ్‌ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

మోర్తాడ్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో శనివారం మండలంలోని పాత్రికేయులు అందరూ సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా భూమ గౌడ్‌ ఆంధ్రజ్యోతి, ఉపాధ్యక్షునిగా రవి మన తెలంగాణ, ప్రధాన కార్యదర్శిగా బి సాయన్న ప్రజాపక్షం, క్యాషియర్‌గా విజయ్‌ నవతెలంగాణ, జాయింట్‌ సెక్రటరీగా సాదిక్‌ ఉర్దూ, సల‌హాదారులుగా మెట్రో చంద్రశేఖర్‌ సాక్షి, కార్యవర్గ సభ్యులుగా ధర్మపురి గంగాధర్‌, శ్రీనివాస మూర్తి, సురేష్‌ శ్రీనివాస్‌, నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో పాత్రికేయులు సురేష్‌ గౌడ్‌, ...

Read More »