Breaking News

చికిత్స అందించక డబ్బులు తీసుకొని పంపిస్తే ఆస్పత్రుల‌పై చర్యలు

నిజామాబాద్‌, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేవలం ఫీజుల‌ కోసం కరోనా పేషెంట్లను అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందించకుండా పంపిస్తే ఆయా ఆసుపత్రుల‌పై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన తిరుమల‌, మనోరమ, ప్రతిభ ప్రైవేటు ఆసుపత్రుల‌లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంటర్ల వివరాలు రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ వివరాల‌ను రిజిస్టర్‌లో పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి యాజమాన్యాల‌తో మాట్లాడుతూ, పేషెంట్లకు సరైన చికిత్సను అందించగల‌ స్తోమత, పరిజ్ఞానము ఉంటేనే ఆసుపత్రుల‌లో చేర్చుకోవాల‌ని, అంతేగాని కేవలం డబ్బు వసూలు చేసుకోవడానికి చేర్చుకుని సరైన చికిత్స అందించకుండా ఫీజు వసూలు చేసిన అనంతరం పంపిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ప్రైవేటు ఆసుపత్రుల‌లో అధిక ఫీజు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఎట్టి పరిస్థితులోనూ అక్రమాల‌ను చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టంగా తెలిపారు. 

అనంతరం గంగాస్థాన్‌ లోని ఔషధ గిడ్డంగిలో పర్యటించి అందుబాటులో ఉన్న ఇంజక్షన్లు, రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ హోం ఐసోలేషన్‌ కిట్స్‌ వివరాల‌ను పరిశీలించారు. 8 వేల‌కు పైగా రెమ్డెసివిర్‌ ఇంజక్షన్లు, 35000 రాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌, 5500 హోమ్‌ ఐసోలేషన్‌ కిట్స్‌ అందుబాటులో సంతృప్తికరంగా ఉన్నాయని ఫార్మసిస్ట్‌ రాధా కిషన్‌ కలెక్టర్‌కు వివరించారు. 

అన్ని స్టాక్స్‌ న్వి నిర్వహణ సరైన పద్ధతిలో చేయాల‌ని, అవసరం అయిన వారికి మాత్రమే వీటిని సరఫరా చేయాల‌ని ఎక్కడ కూడా పొరపాట్లకు అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల‌ని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాల‌ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article