Breaking News

ఉపాధి కూలీ మృతి

కామారెడ్డి, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎర్ర పహాడ్‌ గ్రామంలో ఇజిఇఎస్‌ పనిలో భాగంగా రోడ్లకు మొరం కొడుతున్నప్పుడు చిట్యాల బల‌వ్వ అక్కడే రోడ్డు పై మొరము లెవల్‌ చేస్తున్నపుడు ట్రాక్టర్‌ వెనుక భాగం తగిలి బాల‌వ్వ పడిపోయింది.

అక్కడ నుండి ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించగా కామారెడ్డికి వెళ్ళమని చెప్పారు. అంబులెన్స్‌లో తీసుకెళ్లగా వాళ్ళు టెస్ట్‌ చేసి బాల‌వ్వ మరణించిందని చెప్పారు. బల‌వ్వకు భర్త, కొడుకు సాయిలు కూతురు సౌందర్య ఉన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article