Breaking News

నిజామాబాద్‌ జిల్లాలో 2 వేల‌కే సిటిస్కాన్‌

నిజామాబాద్‌, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి సిటీ స్కాన్‌ టెస్ట్‌ తప్పనిసరి అయినందున పేద ప్రజల‌పై అధిక ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో సిటీ స్కాన్‌ టెస్ట్‌ ధరను డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లు 2 వే రూపాయలు మాత్రమే తీసుకోవాల‌ని మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌ జిల్లా సిటిస్కాన్‌ యజమాన్యాల‌ను కోరారు.

ఇందూరు సిటీ స్కాన్‌ యజమాని డా.రవీందర్‌ రెడ్డి, ఆర్మూర్‌ అమృత ల‌క్ష్మీ సిటీ స్కాన్‌ డా.జయ ప్రకాష్‌తో పాటు పలువురు సిటీ స్కాన్‌ యజమానుల‌తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. సిద్ధిపేట, సిరిసిల్ల‌, కరీంనగర్‌ వంటి జిల్లాలో సి.టి. స్కానింగ్‌కు రెండు వేలు తీసుకుంటున్నారని మన జిల్లాలో కూడా ఫిలింతో రెండువేలు తీసుకొవల‌సినదిగా ఆయా యజమానుల‌ను కోరారు.

ప్రస్తుతం ఒక్కో స్కానింగ్‌కు నాలుగు నుండి 5 వేలు వసూలు చేస్తున్నారని కరోనా వంటి కష్ట సమయంలో ప్రజల‌పై అధిక భారం పడకుండా చూడాల‌ని మంత్రి కోరారు. యాజమాన్యాల‌తో మాట్లాడిన అనంతరం మంత్రి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి మరియు డిఎం అండ్‌ హెచ్‌వోతో ఫోన్‌లో మాట్లాడారు. 2000 రూపాయల‌కే సిటీ స్కాన్‌ చేసేలా సిటీ స్కాన్‌ యాజమాన్యాల‌తో ఆదివారం మీటింగ్‌ ఏర్పాటు చేసుకోవాల‌ని మంత్రి వేముల‌ కలెక్టర్‌ మరియు డిఎం అండ్‌ హెచ్‌వోను ఆదేశించారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article