Breaking News

46వ వార్డులో సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారి

కామారెడ్డి, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి పట్టణం 46 వార్డులో కరోన సెకండ్‌ దశలో రెండవ సారి సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయడం జరిగింది. వార్డు కౌన్సిల‌ర్‌ కోయల్‌ కార్‌ కన్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ను అందరూ సహకరిస్తూ తమ తమ ఇళ్లలోనే ఉంటూ తమ కుటుంబాన్ని కాపాడుకుంటే దేశాన్ని కాపాడినట్టేనని, అవసరం ఉంటేనే బయటకు వెళ్లండి, విధిగా మాస్కు కచ్చితంగా పెట్టుకోవాల‌ని, అలాగే చేతుల‌కు శానిటైజర్‌ కచ్చితంగా వాడాలి, కోవిడ్‌ నిబంధనలు ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాల‌ని, వ్యాక్సినేషన్‌ టీకా కచ్చితంగా అర్హత ఉన్నవారు తీసుకోవాల‌ని సూచించారు.

కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తము గ్రామాల‌లో పట్టణాల‌లో పెద్ద మొత్తంలో ద్రావణం పిచికారి చేయడం జరుగుతుందని, శాసనసభ్యులు గంప గోవర్ధన్‌ ఆదేశాల‌ మేరకు ఇట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే మున్సిపల్‌ చైర్మన్‌కి, వైస్‌ చైర్మన్‌కి, రాష్ట్ర నాయకులు నిట్టూ వేణుకి, రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ముజీబోద్దీనుకి వార్డు ప్రజల‌ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article