Breaking News

మోర్తాడ్‌ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

మోర్తాడ్‌, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో శనివారం మండలంలోని పాత్రికేయులు అందరూ సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా భూమ గౌడ్‌ ఆంధ్రజ్యోతి, ఉపాధ్యక్షునిగా రవి మన తెలంగాణ, ప్రధాన కార్యదర్శిగా బి సాయన్న ప్రజాపక్షం, క్యాషియర్‌గా విజయ్‌ నవతెలంగాణ, జాయింట్‌ సెక్రటరీగా సాదిక్‌ ఉర్దూ, సల‌హాదారులుగా మెట్రో చంద్రశేఖర్‌ సాక్షి, కార్యవర్గ సభ్యులుగా ధర్మపురి గంగాధర్‌, శ్రీనివాస మూర్తి, సురేష్‌ శ్రీనివాస్‌, నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

కార్యక్రమంలో పాత్రికేయులు సురేష్‌ గౌడ్‌, రాజు, హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్‌ భోగ ధరణి ఆనంద్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యుల‌ను శాలువాల‌తో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

22న సర్వసభ్య సమావేశం

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌యంలో ఈ నెల‌ ...

Comment on the article