Breaking News

Daily Archives: May 16, 2021

వ్యక్తి ఆత్మహత్య యత్నం

కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం కుప్రీయల్‌ గ్రామనికి చెందిన చేగా బాబాయ్య (45) కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. కాగా బాబాయ్య భార్య భర్తల‌ మద్య కొద్దిరోజులుగా కుటుంబ గొడవ‌లు జరుగుతున్నాయి. ఆదివారం భార్య వారి పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన బాబాయ్య కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. చుట్టుపక్కల‌ వారు వచ్చి మంటల‌ను ఆర్పడంతో కామారెడ్డి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు.

Read More »

పోలీసుల‌కి మాస్కుల‌ పంపిణీ

కామరెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల‌ కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్లో పోలీసుల‌కి అఖిల‌ భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఐ రాజేశ్వర్‌ గౌడ్‌ చేతుల‌ మీదుగా మాస్కులు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా ఇంచార్జ్‌ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటించాల‌ని, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి సామాజిక ...

Read More »

ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందించడానికి సిద్ధం

కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రక్తదాతల‌ సమూహం పిలుపుమేరకు బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త నిలువ‌లు తక్కువగా ఉన్నాయని తెలియజేయడంతో దోమకొండ మండల‌ కేంద్రానికి చెందిన మందుల‌ సంతోష్‌ కుమార్‌ ఆదివారం ఆరోసారి ఓ పాజిటివ్‌ రక్తదానం చేయడం జరిగిందని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. లాక్‌ డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ దోమకొండ నుండి వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని, రక్తదానం చేసిన రక్తదాతను అభినందించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ కరోనా మొదటి వేవ్‌ ఉన్న ...

Read More »

స్కానింగ్‌ ఫీజు రూ. 2 వేల‌కు అంగీకారం

నిజామాబాద్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేషంట్ల నుండి స్కానింగ్‌ చేసినందుకుగాను ఫీజు కింద 4, 5 వేల‌ రూపాయల‌కు బదులు రూ. 2000 తీసుకోవడానికి సంబంధిత యాజమాన్యాలు అంగీకరించినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రివర్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి సూచన మేరకు కలెక్టర్‌ ఆదివారం తన చాంబర్లో ఐఎంఏ ప్రతినిధులు, స్కానింగ్‌ సెంటర్ల యాజమాన్యాల‌తో తన చాంబర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో లేబరేటరీలు ఆసుపత్రుల‌ ప్రజల‌కు ...

Read More »